Abn logo
Sep 22 2021 @ 13:00PM

రోడ్డు పక్కన మృతదేహం.. హంతకులను పట్టుకున్న పోలీసులు.. అసలు విషయం తెలిసి షాక్..

అతని పేరు ప్రదీప్ బాగ్దే.. అతనో ప్రముఖు ప్రాపర్టీ డీలర్.. ఈ నెల 15వ తేదీ నుంచి అతను అదృశ్యమయ్యాడు.. భార్య, కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా ఆచూకీ దొరకలేదు.. నాలుగు రోజుల తర్వాత అతని మృతదేహం డ్రైనేజ్‌లో కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హంతకులను పట్టుకున్నారు.. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. అతని భార్యే హత్య చేయమని తమకు సుపారీ ఇచ్చిందని వారు చెప్పారు.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది.


నాగ్‌పూర్‌కు చెందిన ప్రాపర్టీ డీలర్ ప్రదీప్ బాగ్దే మృతదేహం ఖపా పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు పక్కన డ్రైనేజ్‌లో దొరికింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు నిందితులు పవన్ చౌదరి, సుమిత్ సాహూలను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రవీణ్ భార్యే ఈ హత్య చేయించిందని వారు పోలీసుల ఎదుట అంగీకరించారు. రూ.3 లక్షలకు డీల్ కుదరిందని, రూ.50 వేలు అడ్వాన్స్ ఇచ్చిందని చెప్పారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.     


ప్రత్యేకంమరిన్ని...