Abn logo
Oct 23 2021 @ 00:00AM

యాప్‌తో తగ్గుతున్న బీపీ

నిజమే, యాప్‌ సౌలభ్యంతో ముఖ్యంగా వయోజనుల్లో బీపీ తగ్గుదల కనిపిస్తోంది. ఇరవై ఎనిమిది వేలమందిపై మూడేళ్ళుగా జరుపుతున్న అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ప్రోగ్రామ్‌కు ‘హల్లో హార్డ్‌’ అని పేరుపెట్టారు. బీపీ, బరువు, ఫిజికల్‌ కార్యకలాపాలను ఈ యాప్‌ ట్రాక్‌ చేస్తోంది. బీపీని మేనేజ్‌ చేసుకునేందుకు సూచనలు, సలహాలు కూడా దీనితో అందుతాయి. ఈ ప్రోగ్రామ్‌తో ముఖ్యంగా స్టేజ్‌ 2 హైపర్‌ టెన్షన్‌ ఉన్న వ్యక్తుల్లో 85 శాతం మందికి ఏడాదిలోగా సిస్టోలిక్‌ ప్రెజర్‌ తగ్గింది. మూడేళ్ళ కాలంలో తగ్గుదల గణనీయంగా నమోదైనట్టు ‘జామా నెట్‌వర్క్‌ ఓపెన్‌’ తెలిపింది. మొబైల్‌ టెక్నాలజీతో అనుసంధానమైన హైపర్‌ టెన్షన్‌ సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌తో బీపీని కంట్రోల్‌లో ఉంచవచ్చని గత అధ్యయనాలు సైతం తెలియజేశాయి.