న్యూఢిల్లీ: భారత మహిళల టెన్నిస్ స్టార్ అంకితా రైనా ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు అడుగుదూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఈ గ్రాండ్‌స్లామ్ అర్హత పోటీల్లో 118వ ర్యాంకర్ కటరినా జవాట్సక (ఉక్రెయిన్)పై నెగ్గి క్వాలిఫయర్స్ సిం భారత మహిళల టెన్నిస్ స్టార్ అంకితా రైనా ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడేందుకు అడుగుదూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన ఈ గ్రాండ్‌స్లామ్ అర్హత పోటీల్లో 118వ ర్యాంకర్ కటరినా జవాట్సక (ఉక్రెయిన్)పై నెగ్గి క్వాలిఫయర్స్ సింగిల్స్ ఫైనల్ రౌండ్‌కు చేరింది. 180వ ర్యాంకర్ అంకిత 6-2, 2-6, 6-3తో గెలిచింది. బుధవారం జరగనున్న ఫైనల్ రౌండ్లో ఓల్గా డానిలోవిక్ (సెర్బి యా)తో అంకిత తలపడనుంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయర్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ 3-6, 2-6తో టుంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలై ఇంటిముఖం పట్టాడు.
వైదొలగిన జాన్ ఇస్నర్: అమెరికా స్టార్, ప్రపంచ 25వ ర్యాంకర్ జాన్ ఇస్నెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడడం లేదని ప్రకటించాడు. కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండడంతో అంతదూరం ప్రయాణం చేయడం సరికాదనిపిస్తోందని జాన్ చెప్పాడు. కుటుంబంతో ఈ సమయాన్ని గడపనున్నట్టు తెలిపాడు.