దీపావళి వేడుకలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

ABN , First Publish Date - 2021-10-31T17:29:10+05:30 IST

దీపావళి పండుగ జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. సాధారణంగా, భక్తిపూర్వకంగా వేడుకలు జరుపుకునేందుకు వీలు కల్పించింది. కొవిడ్‌ నిబంధనలు తప్పని

దీపావళి వేడుకలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

బెంగళూరు: దీపావళి పండుగ జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. సాధారణంగా, భక్తిపూర్వకంగా వేడుకలు జరుపుకునేందుకు వీలు కల్పించింది. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శిర వికుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీపావళి పండుగను జాతీయ విపత్తుల నిర్వహణా నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలని స్పష్టం చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా గ్రీన్‌ టపాసులు మినహా ఇతర విక్రయాలు జరపరాదన్నారు. నవంబరు 1 నుంచి 11వ తేదీ వరకు మాత్రమే విక్రయించాలని, కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే దుకాణాలు తెరవాలన్నారు. అనుమతులు పొందినవారే బాణసంచా విక్రయించాల్సి ఉంటుంది. విక్రయదారులు, కొనుగోలు దారులు తప్పనిసరిగా మాస్కు ధరించాల్సిందే అన్నారు. 

Updated Date - 2021-10-31T17:29:10+05:30 IST