Abn logo
May 21 2020 @ 11:33AM

ఫేక్ అకౌంట్‌తో చందాల వ‌సూళ్లు... అప్ర‌మ‌త్తం చేసిన రామాయ‌ణం సీత‌!

దూరదర్శన్‌లో రామాయణం తిరిగి ప్రసారం అవుతున్న‌ప్ప‌టి నుండి ఈ సీరియల్‌లోని నటులు మ‌రోమారు గుర్తింపును ద‌క్కించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీరిని ఫాలో అవుతున్న‌వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. మ‌రోవైపు వారి నకిలీ ఖాతాలు కూడా పెరుగుతున్నాయి. ఈ  సీరియ‌ల్‌లో సీత పాత్ర‌లో క‌నిపించిన న‌టిదీపిక చిఖలియా త‌న పేరుతో వ‌స్తున్న న‌కిలీ ఖాతాల గురించి అభిమానుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. త‌న పేరుతో విరాళాలు కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా సృష్టించార‌ని దీపిక తెలిపారు. ఇటువంటి నకిలీ ఖాతాకు దూరంగా ఉండాల‌ని కోరారు. కాగా ఈ న‌కిలీ ఖాతాకు ఐదు వేల మంది ఫాలోవ‌ర్లు ఉండ‌టం విశేషం. 

Advertisement
Advertisement
Advertisement