May 4 2021 @ 18:45PM

దీపికా పడుకోన్‌ కుటుంబానికి కరోనా!

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. పది రోజులుగా కరోనా లక్షణాలతో ఉన్న దీపికా తండ్రి ప్రకాశ్‌ పడుకోన్‌, తల్లి ఉజ్జల, సోదరి అనీషాలకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అప్పటి నుంచి ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రకాశ్‌ పడుకోన్‌కు జ్వరం తగ్గకపోవడంతో గత శనివారం ఆయన బెంగళూరులో ఓ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యే అవకాశాలున్నాయని దీపిక సన్నిహితులు తెలిపారు.