Abn logo
Sep 25 2020 @ 06:38AM

భర్త రణవీర్‌తో కలిసి ముంబైకి చేరిన దీపికా పదుకొనే

Kaakateeya

రేపు ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు

ముంబై : బాలీవుడ్ ప్రముఖనటి దీపికా పదుకొనే తన భర్త రణవీర్ సింగ్‌తో కలిసి గురువారం రాత్రి గోవా నుంచి ముంబైకు వచ్చారు. ఈ నెల 26వతేదీన నార్కొటిక్సు కంట్రోల్ బ్యూరో అధికారుల దర్యాప్తునకు దీపికా హాజరు కానున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఘటన అనంతరం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల బాగోతం బట్టబయలైంది. దీంతో నార్కొటిక్సు కంట్రోలు బ్యూరో అధికారులు ప్రముఖ సినీతారలు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారాఅలీఖాన్, శ్రద్ధాకపూర్ లకు సమన్లు జారీ చేశారు. దీంతో శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ అధికారులు విచారించనున్నారు. 

సుశాంత్ సింగ్ కేసులో మాదకద్రవ్యాల పాత్ర గురించి ఎన్సీబీ అధికారులు శుక్రవారం దీపికా మేనేజరు కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించనున్నారు. మరో సినీనటి శ్రద్ధాకపూర్ శనివారం ఎన్సీబీ దర్యాప్తునకు హాజరు కానున్నారు. ఎన్సీబీ సమన్లు జారీ చేసిన మరో బాలీవుడ్ నటి సారాఅలీఖాన్ గురువారం ముంబై నుంచి గోవాకు విమానంలో వెళ్లారు. 

Advertisement
Advertisement
Advertisement