Abn logo
Jul 24 2021 @ 23:46PM

ముంజులూరులో జింక పిల్ల

జింక పిల్లను స్వాధీనం చేసుకున్న రేంజర్‌ కృష్ణకుమారి

స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు

బుట్టాయగూడెం, జులై 24: జింక పిల్లను కన్నాపురం అటవీశాఖ అధికారి కృష్ణకుమారి శనివారం స్వాధీనం చేసుకు న్నారు. మూడు రోజుల క్రితం ముంజు లూరుకు చెందిన కొండరెడ్లు తమ మేకల ను అటవీ ప్రాంతానికి తొలుకు వెళ్లారు. సాయంత్రం మేకలు ఇళ్ళకు వస్తుండగా వాటితో కలిసి 6–7 నెలలు వయస్సు ఉన్న జింక పిల్ల వచ్చింది. దీనితో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు గ్రామానికి వెళ్ళి జింక పిల్లను స్వాధీనం చేసుకుని వైద్యపరీక్షలు చేసి తర్వాత అభయారణ్య పాపికొండల అటవీ ప్రాంతంలో వదలి పెట్టినట్లు తెలిపారు.