కుక్కల దాడిలో జింక మృతి

ABN , First Publish Date - 2021-05-10T05:12:00+05:30 IST

మండల పరిధిలోని పెద్దపుత్త పొలా ల్లో ఆదివారం మధ్యాహ్నం కుక్కల దాడిలో జింక మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకెళ్తే... మధ్యాహ్నం పొలం పనులు ముగించుకుని అటుగా వెళుతున్న రైతులకు జింకను వెంబడిస్తున్న కుక్కలు కనిపించాయి.

కుక్కల దాడిలో జింక మృతి
మృతి చెందిన జింక

వల్లూరు, మే 9: మండల పరిధిలోని పెద్దపుత్త పొలా ల్లో ఆదివారం మధ్యాహ్నం కుక్కల దాడిలో జింక మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకెళ్తే... మధ్యాహ్నం పొలం పనులు ముగించుకుని అటుగా వెళుతున్న రైతులకు జింకను వెంబడిస్తున్న కుక్కలు కనిపించాయి. గమనించిన రైతులు తరిమినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర గాయాలపాలైన జింక మృతి చెందింది. ఈ విషయం కడప డిప్యూటీ ఫారెస్టు రేంజర్‌ ఓబులేసుకు ఫోను ద్వారా తెలపగా, ఆయన ఆదేశాల మేరకు ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ కిశోర్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక గ్రామస్తులు, వీఆర్వోల సాయంతో జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, మూడు రోజుల కిందట ఇదే ప్రాంతంలో కుక్కల దాడిలో మగ జింక మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఆదివారం ఆడ జింక మృతి చెందడంతో వీటిపై దృష్టి సారించాలని స్థానికులు ఫారెస్టు అధికారులను కోరారు. 

Updated Date - 2021-05-10T05:12:00+05:30 IST