హేమంత్‌ పరువు హత్య

ABN , First Publish Date - 2020-09-26T09:45:32+05:30 IST

నగరంలో సంచలనం సృష్టించిన హేమంత్‌ పరువు హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు

హేమంత్‌ పరువు హత్య

ఏ సమయంలో ఏం జరిగింది..?


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 25(ఆంధ్రజ్యోతి): నగరంలో సంచలనం సృష్టించిన హేమంత్‌ పరువు హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అమ్మాయి తల్లిదండ్రులు, తల్లి తరఫు బంధువులంతా కలిసి కట్టుగా పథకం వేసి ఆ యువకున్ని పట్టపగలే కిడ్నాప్‌ చేసి, దారుణంగా హత్య చేశారు. గురువారం మధ్యాహ్నం యువకుడిని కిడ్నాప్‌ చేసిన దగ్గర నుంచి మృతదేహం లభ్యమయ్యేంత వరకు ఏ సమయంలో ఏం జరిగిందో ఒక్కసారి పరిశీలిస్తే...


గురువారం మధ్యాహ్నం 2:30కు అవంతిరెడ్డి బంధువులు గచ్చిబౌలిలోని హేమంత్‌ ఇంటికి వచ్చారు. 

  • 2:40కి అవంతిని, ఆమె భర్త హేమంత్‌ను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. 
  • 2:45కు నానా బూతులు తిట్టుకుంటూ కారులో తీసుకెళ్తున్నారు. 
  • 2:55కు అనుమానం వచ్చిన అవంతి తన తండ్రి లక్ష్మారెడ్డికి ఫోన్‌ చేసింది.
  • 3:00కు కారును గోపన్‌పల్లి చౌరస్తా నుంచి ఓఆర్‌ఆర్‌ వైపు వేగంగా తీసుకెళ్తున్నారు.
  • 3:10కి అవంతిక కారులోంచి బయటకు దూకింది. తనతో పాటు హేమంత్‌ను కూడా లాగేసింది.
  • 3:15 : అవంతిక, హేమంత్‌ లింగంపల్లి వైపు పరుగు తీస్తున్నారు.
  • 3:18 : వెంటనే మరో కారులో అవంతి మేనమామ యుగేందర్‌రెడ్డి సుపారి హంతకులతో హేమంత్‌ను పట్టుకొని కారులో పడేశాడు. అవంతిని వదిలేశాడు.
  • 3:20 : అవంతిక తన అత్తమామలకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. గూగుల్‌ మ్యాప్‌ పంపింది.
  • 3:25 : అక్కడికి చేరుకున్న అవంతిక తల్లిదండ్రులు, మేనబావలు వదినలు, అత్తలు అవంతిని పట్టుకోవడానికి వెంబడించారు. 
  • 3:30 : అవంతి అత్తమామలు, సమాచారం అందుకున్న పోలీసులు అవంతి ఉన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
  • 3:40 : రంగంలోకి దిగిన పోలీసులు అవంతి తల్లిదండ్రులు, మిగిలిన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 
  • 3:45 : పోలీసులు అవంతిని, ఆమె అత్తామామలను గచ్చిబౌలికి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
  • 4:00 : గచ్చిబౌలి పోలీసు బృందాలు హేమంత్‌ కోసం గాలింపు మొదలుపెట్టాయి. 
  • 4:30 : కిడ్నాప్‌ చేసిన హేమంత్‌ను పటాన్‌చెరూ మీదుగా జహీరాబాద్‌ వైపు తీసుకెళ్లారు.
  • 5:00 : జహీరాబాద్‌లో నిందితులు మద్యం, తాడు కొనుగోలు చేశారు. 
  • 5:15 : కారులోనే హేమంత్‌ కాళ్లు చేతులు కట్టేశారు. 
  • 5:30-6:30 : జహీరాబాద్‌, సంగారెడ్డి మధ్యలో కొట్టుకుంటూ హేమంత్‌ మెడకు తాడుతో ఉరిబిగించి హత్యచేశారు.
  • 7:30 : మృతదేహాన్ని కిష్టాయిగూడెం గ్రామ శివారులోని పొలాల వైపు చెట్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు.


తెల్లవారుజామున 2:00 : యుగేందర్‌రెడ్డి ఫోన్‌ ఆన్‌ చేశాడు.

  • 3:00 : పోలీసులు సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేసి శామీర్‌పేట ప్రాంతంలో యుగేందర్‌ రెడ్డిని, మరో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు 
  • 4:00 : నిందితులను తీసుకొని పోలీసులు హేమంత్‌ మృతదేహాన్ని పడేసిన ఘటనా స్థలానికి వెళ్లారు.
  • 5:30 : హేమంత్‌ భార్య, కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూపించారు
  • 7:00 : మృతదేహానికి పంచనామా నిర్వహించారు.
  • 7:30 : అక్కడి నుంచి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
  • 8:00 : హేమంత్‌ తల్లిదండ్రులు, బంధువులు ఉస్మానియా మార్చురీకి చేరుకున్నారు
  • 8:00 : మధ్యాహ్నం 3:00 వరకు అంతా అక్కడే ఉన్నారు. 
  • 3:10 : పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
  • 3:15 : మృతదేహాన్ని భద్రపరచడానికి గాను కాంటినెంటల్‌ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-09-26T09:45:32+05:30 IST