అయ్యో..పంజాబ్‌!

ABN , First Publish Date - 2020-10-11T09:17:38+05:30 IST

సునాయాసంగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను పంజాబ్‌ చేజేతులా చెడగొ ట్టుకుంది. డెత్‌ ఓవర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ (3/29), సునీల్‌ నరైన్‌ ...

అయ్యో..పంజాబ్‌!

2 పరుగులతో ఓటమి

కోల్‌కతాను గెలిపించిన ప్రసిద్ధ్‌, నరైన్‌


అబుదాబి: సునాయాసంగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను పంజాబ్‌ చేజేతులా చెడగొ ట్టుకుంది. డెత్‌ ఓవర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ (3/29), సునీల్‌ నరైన్‌ (2/28) అద్భుత ప్రదర్శనతో.. శనివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ 2 పరుగుల తేడాతో ఓడింది. తొలుత కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 164/6తో పోరాడగలిగే స్కోరు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దినేష్‌ కార్తీక్‌ (29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (57) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో పంజాబ్‌ ఓవర్లన్నీ ఆడి 162/5 స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 6 ఫోర్లతో 74), మయాంక్‌ (56) హాఫ్‌ సెంచరీలు వృథా అయ్యాయి. వరుసగా ఐదో మ్యాచ్‌ ఓడిన రాహుల్‌ సేన ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకొంది.

ఆఖర్లో ఢమాల్‌: ఛేదనలో రాహుల్‌-మయాంక్‌ తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించి పంజాబ్‌ను గెలుపు బాటలో నిలిపారు. అయితే, మయాంక్‌ను క్యాచ్‌ అవుట్‌ చేసిన ప్రసిద్ధ్‌.. శతక భాగస్వామ్యాన్ని విడదీశాడు. నికోలస్‌ పూరన్‌(16)ను నరైన్‌ బౌల్డ్‌ చేశాడు. చివరి రెండు ఓవర్లలో పంజాబ్‌ విజయానికి 20 పరుగులు కావాలి. 19వ ఓవర్‌లో సిమ్రన్‌ సింగ్‌ (4)తోపాటు రాహుల్‌ను అవుట్‌ చేసి ప్రసిద్ధ్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌కు 14 రన్స్‌ అవసరమవగా.. నరైన్‌ తొలి ఐదు బంతుల్లో ఏడు పరుగులిచ్చి మన్‌దీప్‌ (0)ను అవుట్‌ చేశాడు. ఆఖరి బంతికి సిక్స్‌ బాదితే మ్యాచ్‌ టై అయ్యే అవకాశం ఉన్నా.. మ్యాక్స్‌వెల్‌ (10 నాటౌట్‌) ఫోర్‌ మాత్రమే కొట్టడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. 

తడబడి.. నిలబడి: అంతకుముందు కోల్‌కతా 11 ఓవర్లు ముగిసేసరికి 64/3 స్కోరే చేసింది. అయితే, కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి రనౌటైన కార్తీక్‌.. మరో ఓపెనర్‌ గిల్‌తో కలసి నాలుగో వికెట్‌కు 82 రన్స్‌ జోడించాడు. ఓపెనర్‌ త్రిపాఠి (4)ని షమి బౌల్డ్‌ చేశాడు. రాణా (2) రనౌట్‌ కాగా.. మోర్గాన్‌ (24)తో కలసి గిల్‌ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే, మోర్గాన్‌ను అవుట్‌ చేసిన బిష్ణోయ్‌.. 3వ వికెట్‌కు 49 రన్స్‌ భాగస్వామ్యాన్ని విడదీశాడు. గిల్‌ రనౌటవగా.. రస్సెల్‌ (2)ను హర్ష్‌దీప్‌ పెవిలియన్‌ చేర్చాడు. 


స్కోరు బోర్డు

కోల్‌కతా: రాహుల్‌ త్రిపాఠి (బి) షమి 4, గిల్‌ (రనౌట్‌) 57, నితీష్‌ రాణా (రనౌట్‌) 2, మోర్గాన్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) బిష్ణోయ్‌ 24, దినేష్‌ కార్తీక్‌ (రనౌట్‌) 58, రస్సెల్‌ (సి) సిమ్రన్‌ సింగ్‌ (బి) హర్ష్‌దీప్‌ 5, కమిన్స్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 164/6; వికెట్ల పతనం: 1-12, 2-14, 3-63, 4-145, 5-150, 6-164; బౌలింగ్‌: షమి 4-0-30-1, హర్ష్‌దీప్‌ సింగ్‌ 4-1-25-1, జోర్డాన్‌ 4-0-37-0, ముజీబ్‌ 4-0-44-0, బిష్ణోయ్‌ 4-0-25-1.

పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 74, మయాంక్‌ (సి) గిల్‌ (బి) ప్రసిద్ధ్‌ 56, పూరన్‌ (బి) నరైన్‌ 16, సిమ్రన్‌ సింగ్‌ (సి) రాణా (బి) ప్రసిద్ధ్‌ 4, మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 10, మన్‌దీప్‌ (సి) (సబ్‌/గ్రీన్‌) (బి) నరైన్‌ 0, జోర్డాన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 162/5; వికెట్ల పతనం: 1-115, 2-144, 3-149, 4-151, 5-158; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-29-0, ప్రసిద్ధ్‌ కృష్ణ 4-0-29-3, నాగర్‌కోటి 3-0-40-0, చక్రవర్తి 4-0-27-0, నరైన్‌ 4-0-28-2, రాణా 1-0-7-0. 

Updated Date - 2020-10-11T09:17:38+05:30 IST