Abn logo
Nov 25 2021 @ 02:34AM

ఓటమి వాకిట విండీస్‌

  • లక్ష్యం 348, ప్రస్తుతం 52/6
  • లంకతో టెస్ట్‌


గాలె: శ్రీలంకతో తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ పరాజయం అంచున నిలిచింది. ఆటకు నాలుగో రోజు లంక నిర్దేశించిన 348 పరుగుల ఛేదనలో.. రమేష్‌ మెండిస్‌ (4/17) దెబ్బకు విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. బుధవారం ఆట నిలిచే సమయానికి బోన్నర్‌ (18), జాషువ (15) క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా 296 పరుగులు కావాల్సిన నేపథ్యంలో చేతిలో 4 వికెట్లే ఉన్నాయి. ఇక వరుణుడు మాత్రమే కరీబియన్ల పరాజయాన్ని అడ్డుకోగలడు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 230 రన్స్‌కు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను లంక 191/4 వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ కరుణరత్నె (83), మాథ్యూస్‌ (69 నాటౌట్‌) అదరగొట్టారు. లంక తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేసింది.