Abn logo
Oct 23 2021 @ 23:46PM

బాలికల హక్కుల రక్షణకు పాటుపడాలి

మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి బాబు

రాజాం రూరల్‌: బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానావకాశాల రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాజాం సీని యర్‌ సివిల్‌ జడ్జి ఎం.బాబు అన్నారు. ‘అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా రాజాంలోని పీఎస్‌ఎన్‌ గుప్త జడ్పీ బాలికోన్నత పాఠశాలలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో బాలికలు ఎదిగేందుకు సహకరించాలన్నారు. సమావేశంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీరాములునాయుడు, న్యాయవాది శ్యాం ప్రసాద్‌, ఎస్‌ఐ. ఇ.శ్రీనివాసరావు, హెచ్‌ఎం. మాధురి, డిప్యూటీ తహసీల్దార్‌ సాయి పాల్గొన్నారు.