Abn logo
Mar 17 2021 @ 20:17PM

నంది విగ్రహం అపహరణ కేసులో దొంగల అరెస్ట్

కర్నూలు: నంది విగ్రహం అపహరణ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సి.బెళగల్ మండలంలోని యనగండ్లలో నంది విగ్రహాన్ని నిందితులు అపహరించారు. ఈ అపహరణ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నంది విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


యనగండ్లలో నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన విషయం తెలిసిందే. గ్రామంలోని ఈశ్వరాలయంలో శనివారం నంది విగ్రహాన్ని పెకిలించారు. గుప్త నిధుల కోసమే దుండగులు ఈ పనికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు.