Junior Hockey World Cup: కాంస్య పతక పోరులోనూ నిరాశ పరిచిన భారత్

ABN , First Publish Date - 2021-12-06T02:04:22+05:30 IST

టైటిల్ ఆశలు ఇప్పటికే చితికిపోయిన వేళ కనీసం కాంస్య పతకమైనా సొంతం చేసుకుంటుందని..

Junior Hockey World Cup: కాంస్య పతక పోరులోనూ నిరాశ పరిచిన భారత్

భువనేశ్వర్: టైటిల్ ఆశలు ఇప్పటికే చితికిపోయిన వేళ కనీసం కాంస్య పతకమైనా సొంతం చేసుకుంటుందని భావించిన భారత హాకీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ కప్‌ పోటీల్లో భాగంగా నేడు (ఆదివారం) భారత్-ఫ్రాన్స్ మధ్య కాంస్య పతక పోరు జరిగింది.


గేమ్‌లో తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన ఫ్రాన్స్.. డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ను 1-3తో ఓడించింది. ఫలితంగా కనీసం కాంస్య పతకమైనా దక్కుతుందని భావించిన భారత అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. బెల్జియంతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్‌ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో దారుణ ఓటములు ఎదుర్కొంది.

Updated Date - 2021-12-06T02:04:22+05:30 IST