Abn logo
Sep 21 2021 @ 00:28AM

దళితులకు రక్షణ కరువు

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ దళిత నాయకులు

రాయదుర్గం టౌన, సెప్టెంబరు 20: జగన్మోహన రెడ్డి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని దళిత సంఘం నాయకులు ఆనంద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం  ఆ యన విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీ సు వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. కణేకల్లు మండ లం ఎన హనుమాపురంలో టీడీపీ కార్యకర్త హరిజన లోకే్‌షను పోలీసు లు అన్యాయంగా కొట్టడం హేయమైన చర్య అని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా గెలుపొందిన నరేంద్రబాబును కలవడానికి వెళ్లిన హరిజన లోకే్‌షను పోలీసులు చొక్కా పట్టుకుని కిరాతకంగా కొట్టారని ఆ వేదన వ్యక్తంచేశారు. అతడేమైనా ఉగ్రవాదా అని ప్రశ్నించారు. కణేకల్లు ఎస్‌ఐ, ఏఎ్‌సఐ ఇద్దరు కలసి దళిత యువకుడిని నడిరోడ్డులో చితకబాద డం అన్యాయమని పేర్కొన్నారు. దళిత హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో దళితులపై ప్రతి రోజూ దాడులు జరగడం బాధాకరమని పేర్కొన్నారు. దళిత యువకున్ని అన్యాయంగా చితకబాదిన ఎస్‌ఐ, ఏఎ్‌సఐలపై ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎస్సీసెల్‌ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఎస్సీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు ఆనంద్‌, ఉపాధ్యక్షుడు గెణిగెర నాగరాజు, నాయకులు మఠం సోమశేఖర్‌, కాడప్ప, ఆంజనేయులు పాల్గొన్నారు.