విత్తలోటు 12.34 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-02-27T09:18:39+05:30 IST

జనవరి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ విత్త లోటు బడ్జెట్‌ అంచనాల్లో 66.8 శాతానికి చేరింది.

విత్తలోటు 12.34 లక్షల కోట్లు

నవరి చివరి నాటికి కేంద్ర ప్రభుత్వ విత్త లోటు బడ్జెట్‌ అంచనాల్లో 66.8 శాతానికి చేరింది. రూపాయి విలువ ప్రకారం ఇది రూ.12,34,004 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికిది రూ.18,48,655 కోట్లు లేదా జీడీపీలో 9.5% ఉండవచ్చని అంచనా. 


మౌలిక రంగాల్లో కదలిక: ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి కీలకమైన ఎనిమిది మౌలిక రంగాలు జనవరి నెలలో స్వల్ప వృద్ధిని నమోదు చేశాయి. ఎరువులు (2.7 శాతం), ఉక్కు (2.6 శాతం), విద్యుత్‌ (5.1 శాతం) రంగాలు పురోగమనపథంలో పయనించడంతో ఇన్‌ఫ్రా వృద్ధి రేటు 0.1 శాతంగా నమోదైంది. గత ఏడాది జనవరిలో ఇది 2.2 శాతం ఉంది. 

Updated Date - 2021-02-27T09:18:39+05:30 IST