ప్రతిభను వెలికితీయాలి

ABN , First Publish Date - 2021-12-04T05:35:34+05:30 IST

దివ్యాంగులను ఆదరించాలని, వారిలోని ప్రతిభను వెలికి తీయాలని వక్తలు సూచించారు.

ప్రతిభను వెలికితీయాలి
తణుకులో బహుమతులు అందిస్తున్న న్యాయమూర్తి రాధిక

 దివ్యాంగుల దినోత్సవంలో వక్తలు

పలు పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం

దివ్యాంగులను ఆదరించాలని, వారిలోని ప్రతిభను వెలికి తీయాలని వక్తలు సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా   కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పలు పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందించారు. 

తణుకు, డిసెంబరు 3: దివ్యాంగులు మానసిక దృఢత్వంతో ఏదైనా సాధించ గలరని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.రాధిక అన్నారు. శుక్రవారం అం తర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బాలుర ఉన్నత పాఠశాలలో మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌, నాలుగో అదనపు జిల్లా జడ్జి వీఎస్‌ ఎస్‌ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో న్యాయమూర్తి రాధిక సమావేశం నిర్వ హించారు. పారా ఒలింపిక్స్‌లో దివ్యాంగులు సాధించిన విజయాలపై న్యాయ మూర్తి రాధిక వివరించారు. ప్రధానోపాధ్యాయుడు కేఎన్‌వీవీ ప్రసాద్‌, విద్యా కమిటీ చెర్మన్‌ జీవీ లక్ష్మి, ప్యానల్‌ న్యాయవాదులు కామన మునిస్వామి, కౌరు వెంకటేశ్వర్లు, కిరణ్మయి, ఉపాధ్యాయుడు ప్రభువరం పాల్గొన్నారు. అనంతరం పలు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

ఇరగవరం: దివ్యాంగులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ఇరగవరం ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఇరగవరం భవిత కేంద్రంలో దివ్యాంగులకు నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లోని ప్రతిభను వెలికి తీసి వారిని ఉన్నతస్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. ఇరగవరం జడ్పీ హైస్కూల్‌ ప్రఽధానోపాధ్యాయుడు టి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. 

పెరవలి: పెరవలి మండల లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో కానూరులో మానసిక దివ్యాంగుల పాఠశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విజే తలకు  లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు శిరిగినీడి శేషగిరిరావు ఆర్థిక సాయంతో బహు మతులు అందించారు.  ఉపాధ్యాయిని  శిరీష,  హెచ్‌ఎం  వెంకట రమణ,  షేక్‌ మస్తాన్‌, క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. 

పెంటపాడు: భవిత విద్యార్థులపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనపర్చాలని  ఎంపీపీ దాసరి హైమవతి అన్నారు. శుక్రవారం పెంటపాడు పోస్టుబేసిక్‌ భవిత విద్యా వనరుల కేంద్రంలో ఎంఈవో ఎం.శ్రీనివాస్‌ అధ్యక్షతన దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.   సర్పంచ్‌ తాడేపల్లి సూర్యకళ,  ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, హెచ్‌ఎంలు ప్రసాద్‌, అలివేలు,  ఉపాధ్యాయిని మస్తాన్‌బీ, గ్రంథా లయ అధ్యక్షుడు కర్రి వరహాలరెడ్డి,  వైసీపీ మండల యువత అధ్యక్షుడు భాస్కరరెడ్డి, వార్డు సభ్యుడు జయ రాంబాబు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి తాడేపల్లి ఈశ్వరయ్య పాల్గొన్నారు.

గణపవరం:  దివ్యాంగుల్లో ప్రతిభను  ప్రోత్సహిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఎంఈఓ పి. శేషు అన్నారు. శుక్రవారం పిప్పర భవిత కేం ద్రంలో ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. 

భీమడోలు: భీమడోలు మండల పరిషత్‌ కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. అన్నేవారిగూడెం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యార్థి  లీలాకృష్ణమాధవ్‌ ఇంటికి వెళ్ళి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. హెచ్‌ఎం మస్తాన్‌, ఉపాధ్యాయులు దేవిక, తారారాణి, విజయకుమారి పాల్గొన్నారు.

ఉంగుటూరు: దివ్యాంగులను ఆదరించి వారికి కావలసిన సదుపాయాల కల్పనలో సహాయం చేయాలని ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి కోరారు. శుక్రవారం స్థానిక భవిత పాఠశాలలో దివ్యాంగులతో కేకు కట్‌చేయించారు. వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సర్పంచ్‌ బండారు సింధు, తహసీల్దార్‌ జాన్‌రాజు, ఉపాధ్యాయులు విమల, సీఆర్పీఎల్‌ రాజు పాల్గొన్నారు.   

Updated Date - 2021-12-04T05:35:34+05:30 IST