డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల

ABN , First Publish Date - 2021-08-04T05:23:44+05:30 IST

బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళా శాలల 3,5 సెమిస్టర్‌ ఫలితాలను వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు మంగళ వారం విడుదల చేశారు. 3వ సెమిస్టర్‌ పరీక్షలకు 12,426 మంది విద్యార్థులు హాజరుకాగా... 5,025మంది (40.44 శాతం), ఐదో సెమిస్టర్‌కు 10,905 మంది హాజరుకాగా.. 5,415 మంది (49.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాల విడుదల
డిగ్రీ సెమిస్టర్‌ ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు

ఎచ్చెర్ల, ఆగస్టు 3: బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళా శాలల 3,5 సెమిస్టర్‌ ఫలితాలను వీసీ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకటరావు మంగళ వారం విడుదల చేశారు. 3వ సెమిస్టర్‌ పరీక్షలకు 12,426 మంది విద్యార్థులు హాజరుకాగా... 5,025మంది (40.44 శాతం), ఐదో సెమిస్టర్‌కు 10,905 మంది హాజరుకాగా.. 5,415 మంది (49.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ తమ్మినేని కామరాజు, పీజీ పరీక్షల డీన్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య, డిగ్రీ పరీక్షల డీన్‌ ఎస్‌.ఉదయభాస్కర్‌ పాల్గొన్నారు.  


ఫలితాల వివరాలు 

3వ సెమిస్టర్‌

కోర్సు              హాజరు      ఉత్తీర్ణత  శాతం 

బీఏ                1565        414     21.46

బీబీఏ                143        128     89.52

బీసీఏ                 70        64     91.43

బీకాం(కంప్యూటర్స్‌)    872        254      29.13

బీకాం (జనరల్‌)       926       275      29.70

బీఎస్సీ               8850       3980    43.95


5వ సెమిస్టర్‌ ఫలితాలు

కోర్సు               హాజరు      ఉత్తీర్ణత   శాతం

బీఏ                1197         727     60.74

బీబీఏ                97           92    94.84

బీసీఏ                39           39     100

బీకాం (కంప్యూటర్స్‌)  808          192    23.77

బీకాం (జనరల్‌)     826           548   66.35

బీఎస్సీ              7938         3817   48.09

Updated Date - 2021-08-04T05:23:44+05:30 IST