Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిగ్రీ విద్యార్థులకు ఇన్‌స్టెంట్‌ పరీక్షలు నిర్వహించండి

ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 


వెంకటాచలం, డిసెంబరు 7 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలో చదువుతున్న ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇన్‌స్టెంట్‌ పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆదిత్య సాయి కోరారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూలో మంగళవారం ఏపీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీసీ సుందరవల్లిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదిత్య సాయి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇన్‌స్టెంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్న వీఎస్‌యూ ఈ ఏడాది కూడా పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థులు వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. దీనిపై వీసీ స్పందించి  పరీక్షల విభాగంలో ఉన్న డేటా తీసుకుని చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆదిత్య సాయి తెలిపారు.  కార్యక్రమంలో కార్తీక్‌, దేవా, మురళి, ఫణి, చందు తదితరులున్నారు.   


Advertisement
Advertisement