‘వి’ సినిమాను తొలగించండి

ABN , First Publish Date - 2021-03-04T07:28:48+05:30 IST

దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో విడుదలైన నానీస్‌ ‘వి’ చిత్రాన్ని తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఆ సినిమాలో తన ఫొటోను వినియోగించారంటూ నటి, మోడల్‌ సాక్షి మాలిక్‌ హైకోర్టులో పిటిషన్‌

‘వి’ సినిమాను తొలగించండి

  • అమెజాన్‌కు బాంబే హైకోర్టు ఆదేశం
  • నటి సాక్షిమాలిక్‌ ఫొటో తొలగించేదాకా నిలిపేయాలన్న కోర్టు


ముంబై, మార్చి 3: దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో విడుదలైన నానీస్‌ ‘వి’ చిత్రాన్ని తొలగించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఆ సినిమాలో తన ఫొటోను వినియోగించారంటూ నటి, మోడల్‌ సాక్షి మాలిక్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి తన ఫొటోను తీసుకుని, ఆ చిత్రంలో ఓ కమర్షియల్‌ సెక్స్‌ వర్కర్‌గా పేర్కొంటూ తన ఫొటోను పలుమార్లు చూపించారని ఆమె పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ‘‘ఇది ముమ్మాటికీ పరువు నష్టం కలిగించే అంశమే’’అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఫొటోను బ్లర్‌ చేయడమో, పిక్సల్స్‌ పెట్టడమో చేయకూడదని.. పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. 24 గంటల్లో అమెజాన్‌ నుంచి ఆ సినిమాను తీసివేయాలని సూచించింది. ఆ సన్నివేశాల్లో మార్పులు చేసే వరకు ఇతర ప్లాట్‌ఫారాల్లో, థియేటర్లలోను.. ‘వి’ సినిమాను ప్రదర్శించొద్దని పేర్కొంది.

Updated Date - 2021-03-04T07:28:48+05:30 IST