ఢిల్లీ కేపిటల్స్‌లోకి ఆసీస్ ఆటగాడు బెన్ డ్వార్షస్

ABN , First Publish Date - 2021-09-13T22:08:42+05:30 IST

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ కేపిటల్స్ (డీసీ) జట్టులోకి ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ డ్వార్షస్ వచ్చి చేరాడు. ఇంగ్లండ్ ఫాస్ట్

ఢిల్లీ కేపిటల్స్‌లోకి ఆసీస్ ఆటగాడు బెన్ డ్వార్షస్

న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ కేపిటల్స్ (డీసీ) జట్టులోకి ఆస్ట్రేలియా ఆటగాడు బెన్ డ్వార్షస్ వచ్చి చేరాడు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ స్థానంలో డీసీ  అతడిని జట్టులోకి తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో వోక్స్ ఐపీఎల్ పార్ట్-2 నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో బెన్‌ను తీసుకుంది. డ్వార్షస్ త్వరలోనే యూఏఈలోని జట్టు బయోబబుల్‌లో చేరుతాడని డీసీ తెలిపింది. 


డ్వార్షస్ 82 టీ20లలో 23.73 సగటుతో 100 వికెట్లు తీసుకున్నాడు. 27 ఏళ్ల బెన్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 69 మ్యాచుల్లో 85 వికెట్లు తీసుకుని బిగ్‌బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసుకున్న ఆరో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. చివరిసారి ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 బ్లాస్ట్‌లో వార్సెస్టర్‌షైర్‌కు ఆడాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో అరంగేట్రం చేయాల్సి ఉంది. కాగా, ఐపీఎల్ తొలి అర్ధభాగంలో వోక్స్ మూడు మ్యాచుల్లో 5 వికెట్లు తీసుకున్నాడు.    

Updated Date - 2021-09-13T22:08:42+05:30 IST