చెన్నైకి షాక్.. ఢిల్లీకి టాప్

ABN , First Publish Date - 2021-10-05T04:44:57+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ కలిసికట్టుగా రాణించి పటిష్ఠ చెన్నైని మట్టి కరిపించారు. మొదట తొలుత చెన్నై బ్యాట్స్‌మన్‌లో..

చెన్నైకి షాక్.. ఢిల్లీకి టాప్

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ కలిసికట్టుగా రాణించి పటిష్ఠ చెన్నైని మట్టి కరిపించారు. మొదట తొలుత చెన్నై బ్యాట్స్‌మన్‌లో అంబటి రాయుడు(55 నాటౌట్: 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ తప్ప మరొక్క ఆటగాడు కూడా కనీస పరుగులు చేయలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన చెన్నై 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్ట్జే, అవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ తలా ఓ వికెట్ తీశారు. 


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు శిఖర్ ధవన్(39: 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృధ్వీ షా(18: 12 బంతుల్లో 3 ఫోర్లు) మంచి ఓపెనింగ్ ఇచ్చారు. అయితే వీరిద్దరూ అవుటైన తర్వాత బ్యాట్స్‌మన్ కొద్దిగా తడబడ్డారు. కానీ చివర్లో షిమ్రన్ హెట్‌మెయిర్(28 నాటౌట్: 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్(5 నాటౌట్: 8 బంతుల్లో)  వికెట్ పడకుండా కాపాడుకుంటూనే లక్ష్యాన్ని చేరువగా వెళ్లారు.


విజయానికి రెండు పరుగుల దూరంలో అక్షర్ అవుటైనా, పేసర్ కగిసో రబాడా(4 నాటౌట్: 1 బంతుల్లో, 1 ఫోర్) క్రీజులోకి వచ్చిన వెంటనే బౌండరీ బాదాడు. దీంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. 139 పరుగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశారు. 3.25 ఎకానమీ అదరగొట్టాడు. రవీంద్ర జడేజా కూడా 2 వికెట్లు తీయగా, దీపక్ చాహర్, జోష్ హేజల్‌వుడ్, డ్వేన్ బ్రావో తలా ఓ వికెట్ తీశారు. ఇక ఈ విజయంతో 13 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు గెలిచిన ఢిల్లీ 20 పాయింట్లతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరింది. 



Updated Date - 2021-10-05T04:44:57+05:30 IST