షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2021-12-10T01:05:32+05:30 IST

ఈ కేసుపై క్రైం బ్రాంచ్, ఢిల్లీ పోలీసు విచారణ చేపట్టింది. జామియా మిలియా యూనివర్సిటీతో పాటు అలీగఢ్‌లలో షర్జీల్ చేసిన ప్రసంగాలను పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్‌లో షర్జీల్ ఇచ్చిన ప్రసంగాల్లో విధ్వేషమైన మాటలు అనేకం ఉన్నాయని, ఇది భిన్న వర్గాల ప్రజల మధ్య అల్లర్లకు..

షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ మంజూరు

న్యూఢిల్లీ: జామియా మిలియా విశ్వవిద్యాలయంలో డిసెంబర్ 2019లో జరిగిన కార్యక్రమాల్లో విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడనే కారణంతో అరెస్టైన షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ గురువారం మంజూరు చేసింది. ఇమామ్‌పై 2020 జనవరి 25న ఐపీసీ సెక్షన్ 124ఏ (దేశద్రోహం), సెక్షన్ 153ఏ (మతం, ప్రాంతం, కులం, భాష, వర్గం, జెండర్ ఆధారంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం) ప్రకారం కేసు నమోదు చేశారు. జనవరి 28, 2020న బిహార్‌లోని జెహానాబాద్‌లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు.


ఈ కేసుపై క్రైం బ్రాంచ్, ఢిల్లీ పోలీసు విచారణ చేపట్టింది. జామియా మిలియా యూనివర్సిటీతో పాటు అలీగఢ్‌లలో షర్జీల్ చేసిన ప్రసంగాలను పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్‌లో షర్జీల్ ఇచ్చిన ప్రసంగాల్లో విధ్వేషమైన మాటలు అనేకం ఉన్నాయని, ఇది భిన్న వర్గాల ప్రజల మధ్య అల్లర్లకు హింసాత్మక ఘటనలకు కారణం అవుతుందని 2020 ఏప్రిల్‌లో కోర్టు ముందు సమర్పించే సందర్భంలో పేర్కొన్నారు. అయితే షర్జీల్ కస్టడీపై ఈ యేడాది అక్టోబర్‌లో ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. షర్జీల్ టెర్రరిస్ట్ కాదని, కేవలం విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తని పేర్కొంది.

Updated Date - 2021-12-10T01:05:32+05:30 IST