వ్యాక్సినేషన్‌లో కీలక మార్పు.. ఇకపై 24 గంటలూ కరోనా టీకా..!

ABN , First Publish Date - 2021-04-06T01:03:57+05:30 IST

కరోనా ఉధృతి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా కేంద్రాలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా టీకా కార్యక్రమంలో కీలక మార్పుకు తెరలేపింది.

వ్యాక్సినేషన్‌లో కీలక మార్పు.. ఇకపై 24 గంటలూ కరోనా టీకా..!

న్యూఢిల్లీ: కరోనా ఉధృతి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా కేంద్రాలు 24 గంటలూ అందుబాటులో ఉండేలా టీకా కార్యక్రమంలో కీలక మార్పుకు తెరలేపింది. అంతేకాకుండా.. ప్రతిరోజు టీకా కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే..అన్ని టీకా కేంద్రాలకు ఇది వర్తించదని ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది. మంగళవారం నుంచీ ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడో వంతు రాత్రి 9 నుంచి ఉదయం 9 వరకూ పనిచేస్తాయని తెలిపింది. ప్రస్తుతం రాజధానిలో ప్రభుత్వం, ప్రైవేటు టీకా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ సిబ్బంది టీకాలు వేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఇకపై ఏ సమయంలోనైనా టీకా తీసుకునే సౌలభ్యం కలిగింది. రాజధానిలో ఆదివారం నాడు కొత్తగా 4 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-04-06T01:03:57+05:30 IST