Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహాపాదయాత్రకు ఢిల్లీ రైతు ప్రతినిధుల మద్దతు

చిత్తూరు: అమరావతి రైతుల మహాపాదయాత్ర జిల్లాకు చేరుకుంది. రైతుల పాదయాత్రకు ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. తాజాగా ఢిల్లీ రైతు ప్రతినిధులు మద్దతు తెలుపుతూ అమరావతి రైతులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఢిల్లీ రైతు ప్రతినిధులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అమరావతి రైతుల పోరాటం ఫలిస్తుందని, వారి సమస్యను జాతీయ సమస్యగా గుర్తిస్తున్నామని తెలియజేశారు. మహాపాదయాత్రకు దేశ వ్యాప్తంగా స్పందన వస్తోందని, మూడు రోజులు ఇక్కడే ఉండి పాదయాత్రలో పాల్గొంటామన్నారు. రైతుల నుంచి భూమి తీసుకుని.. వాటిని వినియోగించకపోవడం సరికాదన్నారు. ఏపీలో ఏం జరుగుతుందో అన్న విషయంపై దృష్టి పెట్టామన్నారు. ఢిల్లీలో చేసిన ఉద్యమాన్ని మొదట్లో చాలా తక్కువ భావంతో చూశారని, తర్వాత మంచి స్పందన వచ్చిందన్నారు. అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తుందని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు. 17న తిరుపతిలో జరగనున్న బహిరంగ సభకు పెద్ద పెద్ద రైతు నేతలందరూ వస్తారని ఢిల్లీ రైతు ప్రతినిధులు తెలిపారు.

Advertisement
Advertisement