ఐస్‌క్రీమ్ షాపులోకి దూసుకెళ్లిన కారు! తప్పంతా ఆ కుక్కదేనట..

ABN , First Publish Date - 2020-08-02T19:41:40+05:30 IST

వీధి పక్కనే ఓ ఐస్‌క్రీమ్ స్టాల్.. రాత్రి 10.17 కావస్తోంది. కస్టమర్లతో అక్కడ కొంత హడావుడి నెలకొంది. ఓ నలుగురు వినియోగదారులు స్టాల్ పక్కన నిలబడి ఐస్‌క్రీమ్ తింటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా.. ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు ఆ స్టాల్ లోకి దూసుకెళ్లింది. అక్కడున్న ఓ వ్యక్తిని ఆ కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది కూడా. కానీ ఏ దేవుడో అక్కడున్న వారిని కరుణించాడు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

ఐస్‌క్రీమ్ షాపులోకి దూసుకెళ్లిన కారు! తప్పంతా ఆ కుక్కదేనట..

న్యూఢిల్లీ: వీధి పక్కనే ఓ ఐస్‌క్రీమ్ స్టాల్.. రాత్రి 10.17 కావస్తోంది. కస్టమర్లతో అక్కడ కొంత హడావుడి నెలకొంది. ఓ నలుగురు వినియోగదారులు స్టాల్ పక్కన నిలబడి ఐస్‌క్రీమ్ తింటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా.. ఓ బీఎమ్‌డబ్ల్యూ కారు ఆ స్టాల్ లోకి దూసుకెళ్లింది. అక్కడున్న ఓ వ్యక్తిని ఆ కారు కొంత దూరం ఈడ్చుకెళ్లింది కూడా. కానీ ఏ దేవుడో అక్కడున్న వారిని కరుణించాడు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. గాయపడిన నలుగురు బాధితులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని కైలాశ్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.


వాహనం నడిపింది 29 ఏళ్ల వయసున్న రోషినీ అగర్వాల్‌ అని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఆమె ఓ ఫ్లవర్ బోటిక్ నిర్వహిస్తోందని తెలిపారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. రోషినీ వారికి ఆశ్చర్యపరిచే విషయాల్ని చెప్పింది. కారులో తాను ఐస్‌క్రీమ్ తింటుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కారులోనే ఉన్న తన పెంపుడు కుక్క ఒక్కసారిగా తనపైకి దూకడంతో గేరు మారీపోయి కారు ఐస్‌క్రీమ్ స్టాల్‌వైపు దూసుకెళ్లిందని చెప్పింది. ఇక ప్రమాద సమయంలో ఆమె మద్యం మత్తులో లేదని పోలీసులు జరిపిన పరీక్షల్లో తేలింది. దీంతో బాధితులు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద రోషనీపై కేసు నమోదు చేశారు. బాధితులకు చిన్న గాయాలే అయ్యాయని వారందరూ వేరు వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారు తెలిపారు. 

Updated Date - 2020-08-02T19:41:40+05:30 IST