ఢిల్లీ ‘అన్ లాక్’... అయితే హోటల్స్‌కు నో ఛాన్స్!

ABN , First Publish Date - 2020-06-07T19:57:27+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్నట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది.

ఢిల్లీ ‘అన్ లాక్’... అయితే హోటల్స్‌కు నో ఛాన్స్!

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సోమవారం నుంచి లాక్‌డౌన్ నిబంధనలు సడలిస్తున్నట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది. సరిహద్దులు తెరుచుకోనున్నాయి. అన్ని మాల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేయనున్నారు. అయితే హోటల్స్, బ్యాన్ క్వీట్ హాల్స్ తెరవడానికి వీలులేదు. ఇదిలా ఉంటే మందుబాబులకు ఊరట కలిగించేలా మరిన్ని నిర్ణయాలు తీసుకుంది. రేపటి నుంచి డీల్లి చుట్టుపక్కల ఉన్న అన్ని బార్లు ఓపెన్ కానున్నాయి. జూన్ 10 నుంచి లిక్కర్‌పై ఉన్న ప్రత్యేక కరోనా ఫీజును కూడా తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా లిక్కర్‌పై ప్రత్యేక కరోనా పీజు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రజలందరూ మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న కరోనా సోకినవారిలో 60 నుంచి 70 శాతం మంది ఢిల్లీ వాసులు కాదని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ఉన్న ఆస్పత్రులు కేవలం ఢిల్లీ వాసులకోసమేనని, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు అందరికోసమని తెలిపింది. ఢిల్లీలో ఈ నెల చివరి వరకు 15 వేల పడకలు అవసరం ఉన్నాయని, సడలింపుల నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. 


Updated Date - 2020-06-07T19:57:27+05:30 IST