Abn logo
Jul 1 2020 @ 09:08AM

చైనా పౌరుల‌కు టాక్సీ సేవ‌లు బ్యాన్‌!

న్యూఢిల్లీ: ఢిల్లీ హోటల్ అసోసియేషన్ చైనా పౌరుల‌కు తాము సేవ‌లు అందించేది లేద‌ని తెగేసిచెప్పిన ద‌రిమిలా, ఇప్పుడు ఇదే బాట‌లో టూర్ అండ్ ట్రావెల్ అసోసియేషన్ కూడా న‌డుస్తోంది. చైనా పౌరులకు టాక్సీ సేవలు అందించ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ఈ విష‌య‌మై ఢిల్లీ టూర్ అండ్ టాక్సీ ట్రావెల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కమల్ చిబ్బర్ మాట్లాడుతూ, తాము నడిపే టాక్సీల‌లో చైనా పౌరులను కూర్చోబెట్టుకోకూడ‌ద‌ని నిర్ణయించామ‌న్నారు. త‌మ అసోసియేష‌న్‌లో 500 మందికి పైగా టాక్సీ ఆపరేటర్లు, ట్రావెల్ యజమానులు భాగ‌స్వాములుగా ఉన్నార‌ని చెప్పారు. తామంతా చైనీయుల‌కు తమ సేవలను అందించ‌కూడ‌ద‌ని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామ‌న్నారు. దీనికితోడు తాము నడిపే వాహ‌నాల‌పై చైనా పౌరుల‌కు సేవ‌లు అందించ‌బోమంటూ నోటీసులు అతి‌కిస్తామ‌న్నారు. 

Advertisement
Advertisement
Advertisement