కారు పోయిన 20 రోజులకు చేతికందిన చలానా

ABN , First Publish Date - 2020-07-13T02:17:42+05:30 IST

దేశరాజధాని న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతని కారు దొంగతనానికి గురయింది.

కారు పోయిన 20 రోజులకు చేతికందిన చలానా

న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. అతని కారు దొంగతనానికి గురయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అతను.. కారు దొంగను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారా? అని ఎదురుచూడసాగాడు. ఇలా 20 రోజులు గడిచిన తర్వాత కొన్ని రోజుల క్రితం మీ కారు స్పీడ్ లిమిట్ బ్రేక్ చేసిందంటూ ఓ చలానా వచ్చింది. అది తీసుకున్న సదరు ఢిల్లీవాలా.. ‘వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ సమీపంలో నా కారు పోయింది. దాన్ని ఇప్పటికి ముక్కలు చేసి అమ్మేశారని అనుకుంటున్నా’ అని తెలిపాడు. పోలీసులు ఇంకా ఆ దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

Updated Date - 2020-07-13T02:17:42+05:30 IST