Abn logo
Jun 23 2021 @ 09:00AM

ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేకుండా విమాన ప్రయాణికుడి హల్ చల్

న్యూఢిల్లీ : ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేకుండా విమానం ఎక్కేందుకు ఢిల్లీలోని విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడు హంగామా చేయడంతో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రుద్రాపూర్ పట్టణానికి చెందిన సురాజ్ పాండే వ్యాపారవేత్త ముంబైకు వెళ్లేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయానికి వచ్చాడు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేనందున తాము విమానంలో ఎక్కడానికి అనుమతించలేమని విస్తారా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన సురాజ్ పాండే అరుపులు కేకలతో సిబ్బందిపై దాడికి యత్నించాడు. దీంతో విస్తారా ఎయిర్ లైన్స్ మేనేజరు దీపక్ ఛాదా చేసిన ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన సూరజ్ పాండేను అరెస్టు చేశారు. 

క్రైమ్ మరిన్ని...