సర్కారీ స్కూళ్లలో దేశభక్తి పాఠాలు... నూతన సిలబస్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్!

ABN , First Publish Date - 2021-08-15T12:20:54+05:30 IST

ఢిల్లీలోని సర్కారీ స్కూళ్లలో చదువుకుంటున్న...

సర్కారీ స్కూళ్లలో దేశభక్తి పాఠాలు... నూతన సిలబస్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్కారీ స్కూళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు దేశభక్తి పాఠాలు భోదించనున్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో దేశభక్తి పాఠాలు భోదించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గడచిన 70 ఏళ్లలో మిగిలిన అన్ని అంశాలు బోధిస్తూ, దేశభక్తి పాఠాలకు ప్రాధాన్యతనివ్వలేదు.


దీనిని గుర్తించిన ఢిల్లీ సర్కారు ప్రతీరోజూ విద్యార్థులకు దేశభక్తి పాఠాలు భోధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముందుగా ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నేతృత్వంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ దేశభక్తి పాఠాలతో మనదేశ గొప్పతనం, చారిత్రక ప్రాధాన్యతా అంశాలు, సంస్కృతి, సంప్రదాయాలు మొదలైనవి భోదించనున్నారు. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించే దిశగా పాఠాలకు రూపకల్పన చేయనున్నారు.

Updated Date - 2021-08-15T12:20:54+05:30 IST