Abn logo
Sep 21 2021 @ 07:02AM

దుబాయ్ రెడ్ లైన్ ఘనతను దాటనున్న ఢిల్లీ పింక్ లైన్!

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలోని పింక్ లైన్‌ను డ్రైవర్ లెస్‌గా మార్చేందుకు అవసరమైన సాంకేతిక మార్పులను చేస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి  డ్రైవర్ లేకుండానే పింక్ లైన్‌పై నడిచే మెట్రోలలో ప్రయాణించేందుకు ప్రయాణికులకు అవకాశం కలగనుంది. ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయితే ఢిల్లీలోని పింక్ లైన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన(సింగిల్ లైన్) డ్రైవర్ లెస్ మెట్రో లైన్‌గా ఘనత సాధించనుంది. ఇప్పటి వరకూ ఈ ఘనత 52.1 కిలోమీటర్ల పొడవైన దుబాయ్ రెడ్ లైన్ పేరిట ఉంది. ఢిల్లీ పింక్ లైన్ 58.6 కిలోమీటర్ల పొడవుతో 38 స్టేషన్లను కలిగివుంది. కాగా మెట్రో సేవలను డ్రైవర్ లెస్‌గా మార్చేందుకు కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్(సీబీటీసీ) టెక్నిక్‌ను అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం సిగ్నలింగ్, ఇంటర్ లింకింగ్ పనులు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...