Abn logo
May 18 2021 @ 00:29AM

సుశీల్‌ ఆచూకీ చెబితే రూ.లక్ష

న్యూఢిల్లీ: రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష రివార్డును సైతం ప్రకటించారు. ఛత్రశాల్‌ స్టేడియంలో జరిగిన గొడవలో యువ రెజ్లర్‌ మృతికి కారకుడిగా సుశీల్‌పై ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి తను పరారీలోనే ఉన్నాడు. అలాగే సుశీల్‌ సహచరుడు అజయ్‌ కుమార్‌ సమాచారం తెలిపిన వారికి రూ.50 వేల రివార్డును ప్రకటించారు. ఇప్పటికే సుశీల్‌పై లుక్‌అవుట్‌ నోటీసుతో పాటు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ చేశారు.


Advertisement