రాకేష్ తికాయిత్ సహా పలువురు రైతు నేతలపై ఎఫ్ఐఆర్

ABN , First Publish Date - 2021-01-27T22:27:26+05:30 IST

రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగడంపై భారతీయ..

రాకేష్ తికాయిత్ సహా పలువురు రైతు నేతలపై ఎఫ్ఐఆర్

న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగడంపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేష్ తికాయిత్ సహా పలువురు రైతు నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ర్యాలీకి సంబంధించి జారీ చేసిన 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' నిబంధనలను వీరు ఉల్లంఘించరంటూ ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.


'ఎన్ఓసీని ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదైన వారిలో రైతు నేతలు ధర్మన్ పాల్, రాజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, భూటా సింగ్ బుర్జిగిల్, జోగిందర్ సింగ్ ఉగ్రహ పేర్లు ఉన్నాయి' అని ఢిల్లీ పోలీసులు బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా రైతులు బారికేడ్లు తోసుకుంటూ ఢిల్లీలోకి ప్రవేశించారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రతిఘటించారు. పలు చోట్ల విధ్వంస ఘటనలు చేటుచేసుకున్నారు. ఈ హింసాత్మక ఘటనల్లో 300 మందికి పైగా పోలీసులు గాయపడటంతో 22 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

Updated Date - 2021-01-27T22:27:26+05:30 IST