రెజ్లర్ సుశీల్ కుమార్‌ను చంపేస్తానని బెదిరించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-01T21:13:18+05:30 IST

ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను చంపేస్తానని బెదిరించిన ఢిల్లీ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కాలా జతేది, అతడి భాగస్వామి

రెజ్లర్ సుశీల్ కుమార్‌ను చంపేస్తానని బెదిరించిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్

న్యూఢిల్లీ: ప్రముఖ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను చంపేస్తానని బెదిరించిన ఢిల్లీ మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ కాలా జతేది, అతడి భాగస్వామి ‘రాజస్థాన్ డాన్’ అనురాధ చౌదరిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. షహరాన్‌పూర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్ధారించింది. గ్యాంగ్‌స్టర్ కాలా తలపై 7 లక్షల రూపాయల రివార్డు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సోనీపట్‌కు చెందిన జతేదిపై ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. 


రెజర్లర్ సాగర్ రాణా హత్య కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉంటున్న సుశీల్ కుమార్ జతేదీ మేనల్లుడు సోను మహల్‌ను కూడా చితకబాదాడు. విషయం తెలిసిన జతేది చంపేస్తానంటూ సుశీల్ కుమార్‌ను హెచ్చరించాడు. జతేదిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్‌గ్ క్రైమ్ యాక్ట్ (MCCOCA)ను కూడా ఢిల్లీ పోలీసులు ప్రయోగించారు.  


గత పది నెలల్లో కాలా జతేది గ్యాంగ్ ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో 25 హత్యలకు పాల్పడింది. కాలా జతేది భాగస్వామి వీరేంద్ర ప్రతాప్ అలియాస్ కాలా రాణా థాయిలాండ్‌లో ఉన్నాడని, మరో పార్ట్‌నర్ గోల్డీ బ్రార్ కెనడాలో ఓ గ్యాంగ్‌ను నడుపుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఫిబ్రవరి 2020లో కాలా జతేది ఫరీదాబాద్‌లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. 

Updated Date - 2021-08-01T21:13:18+05:30 IST