రెయిడ్‌లో 160 కిలోల గంజాయి పట్టుబడితే.. ఒక కేజీనే దొరికిందంటూ..

ABN , First Publish Date - 2020-09-26T23:53:30+05:30 IST

రెయిడ్‌లో పట్టుబడ్డ గంజాయి కంటే తక్కువ మొత్తాన్ని రికార్డుల్లో నమోదు చేశారనే నేరంపై నలుగురు ఢిల్లీ పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఢిల్లీలోని జహాన్‌గిర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. గత నెలలో జరిగిన రెయిడ్‌లో ఈ అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది.

రెయిడ్‌లో 160 కిలోల గంజాయి పట్టుబడితే.. ఒక కేజీనే దొరికిందంటూ..

న్యూఢిల్లీ: రెయిడ్‌లో పట్టుబడ్డ గంజాయి కంటే తక్కువ మొత్తాన్ని రికార్డుల్లో నమోదు చేశారనే నేరంపై నలుగురు ఢిల్లీ పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఢిల్లీలోని జహాన్‌గిర్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. గత నెలలో జరిగిన రెయిడ్‌లో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. 


మొత్తం 160 కేజీల మాదకద్రవ్యాలు పట్టుబడగా కేవలం ఒక కేజీ మాత్రమే లభించినట్టు రికార్డుల్లో నమోదైందని సమాచారం. మిగిలిన మొత్తాన్ని వారు మార్కెట్లో అమ్మేశారనే ఆరోపణ ఢిల్లీ పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. రెయిడ్ సందర్భంగా..లంచం తీసుకుని నిందితులను వదిలిపెట్టారనేది ఆ నలుగురుపై ఉన్న మరో ఆరోపణ. 

Updated Date - 2020-09-26T23:53:30+05:30 IST