ఢిల్లీ పాజిటివిటీ % 25

ABN , First Publish Date - 2022-01-12T08:23:05+05:30 IST

విడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తోంది. పాజిటివ్‌ రేటు భారీగా నమోదవుతోంది. మంగళవారం పాజిటివిటీ 25.65కు చేరింది. అంటే ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నిరుడు మే 5 తర్వాత ఇదే అత్యధికం. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి ఇతర..

ఢిల్లీ పాజిటివిటీ % 25

ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకరికి పాజిటివ్‌

ఉద్యోగులకు ఇంటి నుంచి పని అమలు

13న సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం

దేశంలో కొవిడ్‌ వ్యాప్తి పరిస్థితిపై సమీక్ష

నితిన్‌ గడ్కరే, లతా మంగేష్కర్‌, కీర్తి సురేశ్‌కు కరోనా

అమెరికాలో 11లక్షల పైగా పాజిటివ్‌లు

లక్షణాలు లేని వాళ్లకు టెస్టులొద్దు: ఐసీఎంఆర్‌


న్యూఢిల్లీ, జనవరి 11: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తోంది. పాజిటివ్‌ రేటు భారీగా నమోదవుతోంది. మంగళవారం పాజిటివిటీ 25.65కు చేరింది. అంటే ప్రతి నాలుగు టెస్టుల్లో ఒకరికి పాజిటివ్‌గా తేలుతోంది. సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న నిరుడు మే 5 తర్వాత ఇదే అత్యధికం. ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి ఇతర వ్యాధులతో వచ్చిన 136 మందికి పరీక్షలు చేయగా 130 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దీన్నిబట్టి ఢిల్లీలో సామాజిక వ్యాప్తి, లక్షణాలు లేనివారు ఎం త ఎక్కువ సంఖ్యలో ఉన్నారో తెలుస్తోంది. మరోవైపు వారం రోజుల నుంచి మరణాలు సైతం పెరుగుతున్నా యి. జూన్‌ 16 తర్వాత అత్యధిక సంఖ్యలో.. కొత్తగా 23 మంది చనిపోయారు. మంగళవారం 21,259 మందికి వె ౖరస్‌ నిర్ధారణ అయింది. రాబోయే వారం రోజులు కేసులు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. బ్యాంకులు, అత్యవసర సర్వీసులు తదితర మినహాయింపులున్న వి భాగంలోనివి కాక.. అన్ని ప్రైవేటు కార్యాలయాలను మూసివేయాలని సర్కారు ఉత్తర్వులిచ్చింది. సిబ్బందిని ఇంటి నుంచి పనిచేయాలని పేర్కొంది. రెస్టారెంట్లు, బార్లను మూసివేశారు. మరోవైపు రోహిణి, తిహార్‌, మండోలి జైళ్లలోని 66 మంది ఖైదీలు, 48 మంది సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. కొవిడ్‌ కేసులకు తగ్గట్లే.. ఢిల్లీలో హెల్ప్‌ లైన్‌ నంబర్లకు కాల్స్‌ పెరుగుతున్నాయి. 1031 నంబరుకు గత వారం ఇలా 700 దాకా కాల్స్‌ వచ్చాయి. 


రోగులకు ఆన్‌లైన్‌ యోగా తరగతులు

ఢిల్లీలో కరోనా రోగులు పెద్దఎత్తున ఐసొలేషన్‌లో ఉంటుండడంతో, వారి కోసం ఆన్‌లైన్‌ యోగా, ప్రాణాయామం తరగతులను నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. రోజుకు 8 గంటల పాటు నిర్వహించనున్నారు. దేశంలో కొవిడ్‌ వ్యాప్తిపై ప్రఽధాని నరేంద్ర మోదీ గురువారం సీఎంలతో సమావేశం కానున్నారు. దేశంలో కొవిడ్‌ వ్యాప్తి పరిస్థితిపై సమీక్షిస్తారు. కాగా, ఇటీవల పనిదినాల్లో 15 లక్షలపైగా పరీక్షలు చేస్తుండగా.. ఆదివారం 13.75 లక్షల టెస్టులే నిర్వహించారు. దీనికి తగ్గట్లే కొత్త కేసులు వచ్చాయి. దేశంలో సోమవారం 1.68 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. క్రితం రోజు(1.79 లక్షలు)తో పోలిస్తే 6 శాతం తక్కువ. ఒమైక్రాన్‌ నిర్ధారిత కేసులు 5,000కు చేరాయి. అయితే, సోమవారం 15.79 లక్షల టెస్టులు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులకు 7 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు, సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌ (92) కొవిడ్‌ బారినపడ్డారు.  వయసు రీత్యా ఆమెను ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు. కొవిడ్‌ సోకడంతో ఆస్పత్రిలో చేరిన సీనియర్‌ నటుడు సత్యరాజ్‌ మంగళవారం డిశ్చార్జి అయ్యా రు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్క రీకి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గోవా ఉప ముఖ్యమంత్రి మనోహర్‌ అజ్‌గ్నాంకర్‌, ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దేవేందర్‌ యాదవ్‌కు పాజిటివ్‌ వచ్చింది. కాగా, కరోనా బారినపడ్డ బిహార్‌, కర్ణాటక సీఎంలు నితీశ్‌కుమార్‌, బసవరాజ్‌ బొమ్మైలతో మోదీ మంగళవారం ఫోనులో మాట్లాడారు. లతా మంగేష్కర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా మోదీ ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-01-12T08:23:05+05:30 IST