కాలుష్య నగరాల్లో రెండో స్థానంలో ఢిల్లీ

ABN , First Publish Date - 2020-12-01T07:52:28+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో భారత రాజధాని న్యూ ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ‘అమెరికా ఎయిర్‌ క్వాలిటీ సూచి’ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. పార్టికులేట్‌ మ్యాటర్‌ (పీఎం) రేటింగ్‌ 229తో న్యూ ఢిల్లీ రెండోస్థానంలో ఉంది...

కాలుష్య నగరాల్లో రెండో స్థానంలో ఢిల్లీ

  • ఆ జాబితాలో ప్రపంచంలో లాహోర్‌ ప్రథమం


లాహోర్‌, నవంబరు 30: ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల జాబితాలో భారత రాజధాని న్యూ ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ‘అమెరికా ఎయిర్‌ క్వాలిటీ సూచి’ సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. పార్టికులేట్‌ మ్యాటర్‌ (పీఎం) రేటింగ్‌ 229తో న్యూ ఢిల్లీ  రెండోస్థానంలో ఉంది. 423 పీఎంతో ఆ జాబితాలో పాకిస్థాన్‌లోని లాహోర్‌ మళ్లీ తొలి స్థానంలో నిలిచింది. నేపాల్‌ రాజధాని ఖాఠ్మాండూ 178 పీఎంతో మూడో స్థానంలో ఉంది. కాగా, ఆసియాలో అత్యధిక రొమ్ము కేన్సర్లు నమోదవుతున్న దేశంగా పాక్‌ నిలిచింది. ‘కమిషన్‌ ఆన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫర్‌ సస్టైనబుల్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌ ది సౌత్‌’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని తెలిపారు. పాక్‌లో ప్రతి ఏడాది దాదాపు 90 వేల మంది మహిళలు రొమ్ము కేన్సర్‌ బారిన పడుతున్నారు. 40 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పాక్‌లో ప్రతి పది మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో కేన్సర్‌ బారిన పడుతున్నారు. 


Updated Date - 2020-12-01T07:52:28+05:30 IST