ఢిల్లీలో రికార్డుస్థాయిలో కరోనా మరణాలు

ABN , First Publish Date - 2020-11-26T23:07:35+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. నెల రోజుల్లోపే ఏకంగా 2,300 మహమ్మారి బారినపడి ప్రాణాలు

ఢిల్లీలో రికార్డుస్థాయిలో కరోనా మరణాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రికార్డుస్థాయిలో కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. నెల రోజుల్లోపే ఏకంగా 2,300 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోవడం ఆందోళను గురిచేస్తోంది. గత నెల 28 నుంచి ఇప్పటి వరకు 2,364 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే, తొలిసారి కరోనా కేసులు ఒక్క రోజులో 5 వేల మార్కును చేరుకున్నాయి. తాజా గణాంకాలపై ఢిల్లీ హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి చూస్తుంటే ప్రమాదకరంగా మారేలా కనిపిస్తోందని హెచ్చరించింది. 


ఢిల్లీలో నిన్న 99 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా, వీరితో కలుపుకుని ఇప్పటి వరకు 8,720 మంది మరణించారు. ఐదు రోజుల తర్వాత కరోనా మరణాలు 100కు దిగువన నమోదు కావడం గమనార్హం. ఈ నెల 19న 98 మరణాలు నమోదు కాగా, 20న 118, 21న 111, 22, 23 తేదీల్లో 121, 24న 109 మరణాలు సంభవించాయి. ఈ నెల 18న అత్యధికంగా 131 మరణాలు నమోదయ్యాయి. అలాగే, ఈ నెల 11న అత్యధికంగా 8,593 కేసులు నమోదయ్యాయి. బుధవారం నాటికి ఢిల్లీలో 5,45,787 కరోనా కేసులు నమోదు కాగా, వీరిలో 4,98,780 మంది కోలుకున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.   


Updated Date - 2020-11-26T23:07:35+05:30 IST