ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ప్రొఫెసర్ పాత్ర

ABN , First Publish Date - 2020-08-11T14:13:57+05:30 IST

ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ పాత్ర ఉందని....

ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ప్రొఫెసర్ పాత్ర

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఢిల్లీ యూనివర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలడం సంచలనం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో 53 మంది మరణించగా, మరో 200 మంది గాయపడ్డారు. ఢిల్లీ మత కలహాలకు తాహిర్ హుసేన్ ఒక్కడే కాదని, ఢిల్లీ ప్రొఫెసర్ పాత్ర కూడా ఉందని పోలీసులు చార్జ్ షీటులో పేర్కొన్నారు. ఈ అల్లర్లలో యూనివర్శిటీ ఫ్రొఫెసర్లు, విద్యార్థుల ప్రమేయముందని నిందితురాలైన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఇచ్చారు. ఢిల్లీ యూనివర్శిటీ మాజీ విద్యార్థిని అయిన 28 ఏళ్ల ఫాతిమా శీలంపూర్ నివాసి. ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారని ఫాతిమా దర్యాప్తులో పేర్కొంది. హిందీ ప్రొఫెసర్ అయిన అపూర్వానందను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతోపాటు అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అల్లర్లు ప్రేరేపించేందుకు ఇంక్విలాబ్, వారియర్ పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారని పోలీసుల దర్యాప్తులో  తేలింది.  

Updated Date - 2020-08-11T14:13:57+05:30 IST