విద్యాలయాలు తెరవడంపై ఢిల్లీ సర్కారు కీలక సమావేశం!

ABN , First Publish Date - 2021-08-07T14:20:40+05:30 IST

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన ప్రస్తుత తరుణంలో...

విద్యాలయాలు తెరవడంపై ఢిల్లీ సర్కారు కీలక సమావేశం!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన ప్రస్తుత తరుణంలో పలు రాష్ట్రాల్లో విద్యాలయాలు తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపధ్యంలో విద్యాలయాల పున: ప్రారంభంపై డిప్యూటీ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ బైజల్ విద్యాలయాలు తెరిచేందుకు విస్తృత స్థాయి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. దీనిలో భాగంగా వైద్య నిపుణుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 


 ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ దీర్ఘకాలంగా విద్యాసంస్థలు మూతపడిన కారణంగా విద్యావ్యవస్థ కుంటుపడిందని, అందుకే ఇప్పుడు అందరూ స్కూళ్లు తెరిచే దిశగా యోచిస్తున్నారన్నారు. అయితే వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం చేయడం ద్వారా విద్యాలయాలను త్వరలోనే తెరిచేందుకు అవకాశం కలుగుతుందన్నారు.

Updated Date - 2021-08-07T14:20:40+05:30 IST