ఢిల్లీ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ రద్దు

ABN , First Publish Date - 2020-04-07T09:50:07+05:30 IST

కొవిడ్‌-19 మహమ్మారితో మరో మెగా ఈవెంట్‌కు బ్రేక్‌ పడింది. దేశ రాజధాని ఢిల్లీలో మే నెలలో జరగాల్సిన షూటింగ్‌ వరల్డ్‌కప్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు...

ఢిల్లీ షూటింగ్‌ వరల్డ్‌కప్‌ రద్దు

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారితో మరో మెగా ఈవెంట్‌కు బ్రేక్‌ పడింది. దేశ రాజధాని ఢిల్లీలో మే నెలలో జరగాల్సిన షూటింగ్‌ వరల్డ్‌కప్‌ను రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు సోమవారం ప్రకటించారు. వాస్తవానికి రైఫిల్‌/పిస్టల్‌, షాట్‌గన్‌ వరల్డ్‌కప్‌ మార్చి 15న ఢిల్లీలో మొదలవ్వాలి. కానీ.. కరోనా కారణంగా ఈ టోర్నీని రెండు విభాగాలుగా విభజిస్తూ.. రైఫిల్‌/పిస్టల్‌ ప్రపంచక్‌పను మే 5 -12 వరకు, షాట్‌గన్‌ పోటీలను జూన్‌ 2-9 వరకు నిర్వహించేలా షెడ్యూల్‌ చేశారు. కరోనాతో దేశంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడంతో పూర్తిగా వరల్డ్‌క్‌పనే రద్దు చేస్తున్నట్టు అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎ్‌సఎ్‌సఎఫ్‌) ప్రకటించింది.

Updated Date - 2020-04-07T09:50:07+05:30 IST