వందశాతం సామర్థ్యం అనగానే... ప్రయాణీకుల తోపులాట... ఫలితంగా...

ABN , First Publish Date - 2021-07-26T16:40:05+05:30 IST

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో....

వందశాతం సామర్థ్యం అనగానే... ప్రయాణీకుల తోపులాట... ఫలితంగా...

న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీలో ఈరోజు నుంచి మరో అన్‌లాక్ ప్రక్రియ మొదలయ్యింది. దీనిలో భాగంగా ఢిల్లీ మెట్రో ఈరోజు నుంచి తన పూర్తి స్థాయి సేవలను ప్రారంభించింది. ఏడాది తరువాత వందశాతం సామర్థ్యంలో మెట్రో రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈరోజు ఇలా మెట్రో సేవలు ప్రారంభమయ్యాయో లేదో... వెంటనే ప్రయాణీకులు మెట్రో వద్దకు గుంపులు గుంపులుగా చేరుకున్నారు. ఏ స్టేషన్ వద్ద కూడా సోషల్ డిస్టెన్సింగ్ కనిపించనే లేదు. ప్రతీ మెట్రో స్టేషన్ వద్ద టిక్కెట్ల కోసం భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. బదర్పూర్ బార్డర్ మెట్రో స్టేషన్, ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్, నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ల వద్ద లెక్కకుమించి ప్రయాణికులు కనిపించారు. దీంతో కొన్ని మెట్రో స్టేషన్లలో సిబ్బంది గేట్లు మూయాల్సిన పరిస్థితి తలెత్తింది.

Updated Date - 2021-07-26T16:40:05+05:30 IST