Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్తకు `ఐ లవ్యూ` అంటూ మెసేజ్.. అతడు ఇంటికి రావడం చూసి ఆమె చేసిన పనికి అందరూ షాక్..

వారిద్దరూ రెండు దశాబ్దాలకు పైగానే కలిసి కాపురం చేశారు.. పిల్లలిద్దరూ అమెరికా వెళ్లిపోవడంతో వీరిద్దరే ఇంట్లో ఉంటున్నారు.. ఇటీవల ఈ ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి.. విడాకులు తీసుకోవాలనుకున్నారు.. విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ మహిళ చేసిన పని అందరికీ షాక్ కలిగించింది.. భర్తను విడిచి ఉండడాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. 


ఇవి కూడా చదవండి

బెయిల్ కోసం అప్లై చేసిన నిందితుడు.. వింత షరతులు విధించిన కోర్టు!కొత్త జంటను ఇంటికి ఆహ్వానించాడా వ్యక్తి.. పిలిచాడు కదా అని వెళితే..

ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌ నిరంకారి కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో 52 ఏళ్ల నేహ, ఆమె భర్త ధరమ్ వర్మ నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఈ దంపతుల మధ్య ఇటీవల విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు తీసుకోవాలనుకున్నారు. గురువారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన భర్తకు నేహ `ఐ లవ్యూ` అనే మెసేజ్ పంపించింది. 


భర్త ఇంటికి వస్తుండగా చూసి అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్థులో ఉన్న తమ బాల్కనీ నుంచి దూకేసింది. వైద్యం కోసం ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని, మహిళ మొబైల్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement