డెలివరీ బైక్స్‌ విషయమై Kuwait సంచలన నిర్ణయం.. అక్టోబర్ 3 నుంచి..

ABN , First Publish Date - 2021-08-31T15:47:52+05:30 IST

కువైత్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డెలివరీ బైక్స్ విషయమై తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ బైక్స్‌ను రింగ్ రోడ్స్, హైవేలపై రాకుండా బ్యాన్ చేసింది.

డెలివరీ బైక్స్‌ విషయమై Kuwait సంచలన నిర్ణయం.. అక్టోబర్ 3 నుంచి..

కువైత్ సిటీ: కువైత్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డెలివరీ బైక్స్ విషయమై తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ బైక్స్‌ను రింగ్ రోడ్స్, హైవేలపై రాకుండా బ్యాన్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 3 నుంచి రింగ్ రోడ్లు, హైవేలపై డెలివరీ బైక్స్ రావడాన్ని పూర్తిగా నిషేధించినట్లు ట్రాఫిక్ అండ్ ఆపరేషన్స్ అఫైర్స్ అధికారి మేజర్ జనరల్ జమాల్ అల్ సయీగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా డెలివరీ కెంపెనీల ఫెడరేషన్‌కు ఆయన పలు కీలక సూచనలు చేశారు. అలాగే డెలివరీ బైక్స్ వల్ల రోడ్లపై ఇతర వాహనదారులకు ఎదురవుతున్న ఇక్కట్లను ఆయన ఫెడరేషన్ దృష్టికి తీసుకేళ్లారు. డెలివరీ బైక్స్‌కు అనుమతి లేని రింగ్ రోడ్లు, హైవేల వివరాలను ఈ సందర్భంగా జమాల్ అల్ సయీగ్ వెల్లడించారు.


ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి రింగ్‌రోడ్, నాల్గో రింగ్‌రోడ్, ఐదో రింగ్‌రోడ్, ఆరో రింగ్‌రోడ్, ఏడో రింగ్‌రోడ్, కింగ్ అబ్దుల్ అజీజ్ రోడ్-30, కింగ్ ఫహాద్ బిన్ అబ్దులాజీజ్ రోడ్-40, కింగ్ ఫైజల్ బిన్ అబ్దులాజీజ్ రోడ్-50, అల్ ఘజాలీ రోడ్-60, జహ్రా రోడ్, గమల్ అబ్దెల్ నాసర్(అప్పర్ బ్రిడ్జి), జబేర్ బ్రిడ్జిపై డెలివరీ బైక్స్‌కు నిషేధం విధించినట్లు తెలిపారు. అలాగే ఈ బైక్స్‌కు బిగించిన బాక్సులకు ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేయరాదని, డ్రైవర్లు తప్పకుండా హెల్మెట్లు ధరించాలని చెప్పారు. 

Updated Date - 2021-08-31T15:47:52+05:30 IST