108 అంబులెన్స్‌లో ప్రసవం

ABN , First Publish Date - 2021-06-23T03:58:35+05:30 IST

108 అంబులెన్స్‌లో ప్రసవం

108 అంబులెన్స్‌లో ప్రసవం

శంషాబాద్‌ రూరల్‌:  108 అంబులెన్స్‌లో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వప్న, మా వాలాల్‌ దంపతులు గండిగూడలో ఉన్న ఫౌంహౌ్‌సలో కూలీలుగా పనిచేస్తున్నారు. స్వప్నకు మంగళవారం పురిటినొప్పులు రావడంతో స్థానికులు 108కు సమాచారం అం దించారు. శంషాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ దేవేందర్‌, ఫైలెట్‌ రవి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన ఆపి కాన్పు చేశారు. స్వప్న మగశిశువుకు జన్మనిచ్చిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.

Updated Date - 2021-06-23T03:58:35+05:30 IST