డెల్టా ప్లస్ వేరియంట్.... ముంబై వాసులను కలవరపెడుతున్న మరో వైరస్...

ABN , First Publish Date - 2021-06-17T23:31:22+05:30 IST

కరోనా తగ్గుముఖం పడుతోందన్న వార్తలతో ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో... మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికించబోతోందా ?

డెల్టా ప్లస్ వేరియంట్.... ముంబై వాసులను కలవరపెడుతున్న మరో వైరస్...

ముంబై : కరోనా తగ్గుముఖం పడుతోందన్న వార్తలతో ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో... మరో కొత్త వైరస్ ప్రపంచాన్ని వణికించబోతోందా ? ప్రత్యేకించి ముంబై వాసులకు ఈ వార్త మింగుడుపడడంలేదు. తాజాగా ‘డెల్టా ప్లస్’ వేరియంట్ అనే కొత్త  స్ట్రెయిన్‌ను కనుగొన్నట్లు నీతి ఆయోగ్ సభ్యుేడు వీకే పౌల్ ప్రకటించారు. ఇది ఈ ఏడాది మార్చిలో యూరప్‌లో మొదటిసారి కనుక్కున్నట్లు చెప్పారాయన. 


ఈ క్రమంలో... మహారాష్ట్ర ఆరోగ్యశాఖ చేసిన హెచ్చరికలు కలవరం కలిగిస్తున్నాయ్. ఈ డెల్టాప్లస్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వచ్చినపక్షంలో... మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు మళ్ళీ లక్షల సంఖ్యలో పెరిగిపోతాయని ఆందోళన కలిగిస్తోంది. అందులో పది శాతం చిన్నారులే ఉంటారంటూ  ఆరోగ్యశాఖాధికారులతో  ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న

రాష్ట్రం అందుకు సన్నాహకార్యక్రమాలు చేపట్టగా, రాష్ట్ర టాస్క్ ఫోర్స్‌తో మంత్రి రాజేష్ తోపే సమావేశంమయ్యారు. కాగా, ముఖ్యమంత్రి  ఉద్దవ్ ఠాక్రే... అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. లిక్విడ్ ఆక్సిజన్, ఔషధాలు, ఎక్విప్‌మెంట్, అన్ని  ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని, అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2021-06-17T23:31:22+05:30 IST