Maharashtra: మళ్లీ డెల్టా ప్లస్ కేసుల కలకలం

ABN , First Publish Date - 2021-08-24T16:52:40+05:30 IST

హారాష్ట్రలో మళ్లీ కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది....

Maharashtra: మళ్లీ డెల్టా ప్లస్ కేసుల కలకలం

నాగపూర్ : మహారాష్ట్రలో మళ్లీ కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ డెల్టాప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య మళ్లీ 103కు పెరిగింది. గత 24 గంటల్లో మరో 27 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. గడ్ చిరోలి జిల్లాలో 6, అమరావతిలో 6, నాగపూర్ జిల్లాలో 5, అహ్మద్ నగర్ జిల్లాలో 4, యావత్ మాల్ జిల్లాలో 3, నాసిక్ లో 2, భండారాలో ఒక డెల్టాప్లస్ వేరియంట్ కేసులు నమోదైనాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో 188 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా, వీటిలో రెండు అల్ఫా వేరియంట్ అని తేలింది. కప్పా వేరియంట్ కరోనా కేసులు 24 నమోదైనాయి. ఇతర కొవిడ్ రకాల కేసులు వెలుగుచూశాయి.డెల్టా ప్లస్ వేరియంట్ కరోనాను గుర్తించేందుకు కస్తుర్బా ఆసుపత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అమెరికా సంస్థ మెషీన్లను అందించింది. 


జీనోమ్ పరీక్షలు చేసే కేంద్రాన్ని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆగస్టు 4వతేదీన ప్రారంభించారు.జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ లో 384 శాంపిళ్లను పరీక్షించారు.మహారాష్ట్రలో ఒక్క సోమవారం రోజే 3,643 కరోనా కొత్త కేసులు వెలుగుచూశాయి. ముంబైనగరంలో 225 కరోనా కేసులు నమోదు కాగా, వారిలో నలుగురు మరణించారు. నగరంలో కరోనాతో మమొత్తం 15,951 మంది మరణించారు. కరోనా థర్డ్ వే ను సమర్థంగా ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఆక్సిజన్, మందుల కోసం అదనపు బడ్జెట్ ను కేటాయించామని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపీ చెప్పారు. 


Updated Date - 2021-08-24T16:52:40+05:30 IST