కరోనా ‘డెల్టా ప్లస్’ కలకలం.. ఓ మహిళకు సోకినట్టు గుర్తించిన అధికారులు..

ABN , First Publish Date - 2021-06-18T04:35:45+05:30 IST

మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో 65 ఏళ్ల ఓ మహిళకు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘‘డెల్టా ప్లస్’’ సోకినట్టు అధికారులు వెల్లడించారు...

కరోనా ‘డెల్టా ప్లస్’ కలకలం.. ఓ మహిళకు సోకినట్టు గుర్తించిన అధికారులు..

భోపాల్: మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో 65 ఏళ్ల ఓ మహిళకు కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘‘డెల్టా ప్లస్’’ సోకినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొవిడ్-19 సెకండ్ వేవ్ సృష్టించిన కల్లోలం నుంచి... వైరస్ నివారణ కోసం విధించిన ఆంక్షల నుంచి కోలుకోకముందే కొత్త వేరియంట్ వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఓ పెద్ద ఆస్పత్రి పక్కనే నివాసం ఉండే సదరు మహిళ నుంచి గత నెల 23న నమూనాలు సేకరించినట్టు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి నిన్న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) నుంచి రిపోర్టులు వచ్చాయనీ.. ఆమెకు ‘‘డెల్టా ప్లస్’’ వేరియంట్ పాజిటివ్ ఉన్నట్టు తేలిందని వెల్లడించారు. కాగా సదరు మహిళకు ‘‘విభిన్న వేరియంట్’’ సోకినట్టు రాష్ట్ర వైద్య విద్య మంత్రి విశ్వాస్ సారంగ్‌ ధ్రువీకరించినప్పటికీ.. ఆయన అంతకంటే ఎక్కువ వివరణ ఇవ్వలేదు. ‘‘జినోమ్ సీక్వెన్సింగ్ కోసం మేము శాంపిల్స్‌ను ఎన్‌సీడీసీకి పంపిస్తున్నాం..’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-18T04:35:45+05:30 IST